CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 173

నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు

nishchalamainadi ellappudu prabhu

More
పల్లవి:నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యము (2)ఆహా! ఆహా! అది ఎంత రమ్యముఆ రాజ్యములో అంత పరిపూర్ణము (1)ఆహా! ఆహా! అది ఎంత భాగ్యముఆ రాజ్యములో వింత ఐశ్వర్యము (1)ఆ నిశ్చల రాజ్యముకు చేరుము -నిత్యములో నీకు బహు ధన్యము (2)
చరణం 1:యేసే సత్యజీవమార్గము-నిశ్చల రాజ్యముకేసే ద్వారము (2) నమ్మిన వారికే ప్రవేశము-మహిమ రాజ్యములోన మోక్షము (2)
చరణం 2:విలువైనది యేసుని అర్పణము నీ రక్షణ కర్పించే తన ప్రాణము ఈ క్షణము నీ పాపము ఒప్పుకొనుము రక్షణ వస్త్రము నీవు ధరించుము
చరణం 3:సిలువలో పలికెన్ యేసు ఆహ్వానము నా నిశ్చల రాజ్యముకు చేరుము నేడే యేసుని అంగీకరించుము పొందుము జీవకిరీటము
చరణం 4:ఆ రాజ్యములో లేదు కలహము క్రీస్తేసు ద్వారానే సమాధానము క్రీస్తుని ప్రేమయే శాశ్వతము నిశ్చల రాజ్యములోనే శాంతము
చరణం 5:నీ యాత్రకు యేసే గమ్యము నిశ్చల రాజ్యములోనే విశ్రమము ఆయనలో నుంచు నీ నమ్మకము చేయుము యేసు నీ స్వంతము