పల్లవి:యౌవనుడా క్రీస్తేసు యోధుడాయౌవనమున కాడిని మోయు వాడ (2)ఓర్చు సామర్థ్యములు గలిగినేర్పుతో జీవించ నేర్వుము (1)
చరణం 1:రారాజు క్రీస్తుకు సైనికుడవై -సాతాను సేనల నెదిరించువాడవై (2)
పోరాడు మత్యంతమగు సహనముతో (2)
జయమొందగ ఆనంద భరితుడవై (2)
చరణం 2:శ్రమించి సేద్యము జేయువాడవై
ప్రథమ ఫలముల భాగస్వామివై
శ్రమఫలిత పంటల బహుగ కోయుచు
సంతోషముతో జీవించు వాడవై
చరణం 3:బంధకములలో ప్రార్థించు వాడవై
హింస దుఃఖము బాధ నోర్చెడి వాడవై
అంధకారమన్న భయమేమిలేక
హత సాక్ష్యమునకు సిద్ధపడు వాడవై
చరణం 4:క్రీస్తువలె ప్రేమించు వాడవై
యేసు వలె సహించెడి వాడవై
క్రీస్తును బోలి విజ్ఞాపన చేయుచు
యేసువలె క్షమించెడి వాడవై
చరణం 5:ఎర్పర్చబడినవారు - నిత్య మహిమకై
క్రీస్తేసు నందలి రక్షణ పొందుటకై
ఓర్పు సహనము కలబరచువా-రు
నిత్యము ఏలుదు-రు ప్రభు ప్రజలై