పల్లవి:విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని (2)
చరణం 1:నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2)
పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2)
చరణం 2:నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా
ఓర్పును ప్రేమను కల్గి - పోరాడుడి విజయముతో
చరణం 3:ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు
అవిధేయత చూపకను - పోరాదుడి విజయముతో
చరణం 4:క్రీస్తేసు మనసు కలిగి - సత్క్రియలను జరిగించి
యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో
చరణం 5:దీన మనసు కలిగి - ప్రియులారా లోబడియు
మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో
చరణం 6:ఆత్మల రక్షణ కొరకై - అర్పించుడి జీవితముల్
అంతము వరకు నిలచి - పోరాడుడి విజయముతో
చరణం 7:యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు
విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము