పల్లవి:సీయోను తిరిగి చెరలో నుండి విడిపించి (1)యెహోవా రప్పించినప్పుడు ఆ.. ఆ.. (2)మనము కలకన్న వారివలె నుంటిమినోటినిండ నవ్వుండెను ఆ.. ఆ.. (2)
చరణం 1:యెహోవా వీరికొరకు గొప్ప కార్యములు చేసెనని
అన్యజనులు చెప్పుకొనిరి (2)
సంతోషభరితులమైతిమి ఆ.. ఆ.. (2)
చరణం 2:దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లు
యెహోవా చెరపట్టబడిన
మావారిని రప్పించుము ఆ.. ఆ.. (2)
చరణం 3:కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారు
సంతోషగానముతో పంటను
యుక్తకాలమున కోసెదరు ఆ.. ఆ.. (2)