పల్లవి:దేవా! నీ అవరణం - మా కెంతో శ్రేయస్కరం (2)ఒక దినము ఇచట గడుపుట మేలు - వెయ్యిదినముల కంటెను (2)
చరణం 1:అద్భుత కార్యములు... ఆ... ఆ... జరిగించు దేవుడవు ఆ... ఆ... (2)
అనవతరం నీ మహిమలు పొగడ మమ్ము నీలో నిలుపుమయ (1)
ఆత్మతో సత్యముతో ఆరాధించగా మనస్సుతో (2)
అల్ఫా ఓమేగయు ఆత్మరూపుడవు ఆనందించగా నీ ఒడిలో (2)
చరణం 2:అత్యంత పరిశుద్ధమా ఆ... ఆ... ఆ... నీదు గుడారమున ఆ.. ఆ ఆ
నివసించుటకు యోగ్యతలోసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్
జుంటి ధారలకన్నను తేనె మధురిమలకన్నను
శ్రేష్ఠమౌ నీదు వాక్కులచేత మము తృప్తి పరచుమయ్యా
చరణం 3:పరిశుద్ధ సన్నిధిలో ఆ... ఆ... ఆ... పరిశుద్ధాత్ముని నీడలో ఆ ఆ..ఆ..
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించెదము
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం
ప్రాణప్రియుడవు పాదముల చేరి ప్రాణార్పనము చేతుము