పల్లవి:క్రీస్తేసు వారసులం- దేవుని వారసులం (2)
చరణం 1:దేవా! నీ రాజ్యమే రానిమ్ము మా ప్రభువా (2)
ఎవరెవ్వరి పాపంబులు - క్షమియింపబడి యున్నవో (2)
వారే దానిని చూతురు
చరణం 2:దేవా! నీ రాజ్యమే - పరలోక రాజ్యము
ప్రభువా! ప్రభువా యనుచు - పిలుచు ప్రతివాడున్
అందెన్నడు చేరడు
చరణం 3:దేవా! నీ రాజ్యమే - నీతితో నిండియున్నది
పరలోక తండ్రి చిత్తము - చేయు ప్రతివాడున్
వారే యందుండెదరు
చరణం 4:దేవా! నీ రాజ్యమే - శాశ్వతంబైనది
ఈ లోక రాజ్యము లన్నియు - ఆయన క్రీస్తువగున్
దేవుని రాజ్యమగున్
చరణం 5:దేవా! నీ రాజ్యమే యుగంబులుండునది
పొందువారికే గాని - మరెవ్వరికి చెందదు
వారెంతో ధన్యులు
చరణం 6:దేవా! నీ రాజ్యమే నిశ్చలమై యున్నది
దేవా! దహించు అగ్నిని నీ కృపను బొందెదము
ప్రీతితో సేవింతుము
చరణం 7:దేవా! నీ రాజ్యమే మహిమతో నిండియున్నది
(భూ)లోక రాజులెల్లరు నీ మహిమ చూచెదరు
రాజుల రాజువు