CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 16

కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును

krutajnyatan talavanchi - naadu jeevamu arpintunu

2 కొరింథీ 5 : 14 "క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది.”

More
Reference recording on YouTube ↗
పల్లవి:కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును (1)లేదే యిక నే యీవి యిల (1) - అర్పింతును నన్నే నీకు (2)
చరణం 1:దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్ (2) దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే (2)
చరణం 2:ఆకర్షించె లోకాశలన్ని - లోక మహిమ నడ్డగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును
చరణం 3:తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినను తీర్చలేను నీ ఋణము
చరణం 4:లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును నీ కర్పింపన్ నే వెనుదీయన్ ఈ కొద్ది నా జీవితము
చరణం 5:చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై