పల్లవి:కల్వరినాథుడా - నన్ను జయించితిరక్షింప మృతుడైన - కల్వరి నాథుడా !
చరణం 1:అత్యంత సుందరుండును - ఎల్లరి కాంక్షణీయుడు
దేవాది దేవుడైన మా - కాల్వరి యేసునాథుడు (1)
చరణం 2:గాయపడి శ్రమలతో - పాపదుఃఖము మోసితివి
సిల్వలో మరణించితివి - దుఃఖ కల్వరినాథుడా!
చరణం 3:శాంతి జీవము నీయను - ఖైదీల విమోచనమునకై
రక్తపు ఊట తెరచితివి - ప్రేమ కల్వరి నాథుడా!
చరణం 4:తెచ్చిన ఈవులెల్లను - మేలుకొరకు మనకిచ్చి
ప్రేమనదిని పోసెను - దయా కల్వరినాథుడు
చరణం 5:మహిమపూర్ణుడగు నిన్ను - కండ్లార చూతుమనుటయే
ఇచ్చట మా ఆదరణ - సాటిలేని కల్వరీ ప్రభూ
చరణం 6:స్ఫటిక సముద్ర తీరమున - నీ ప్రేమయందు మున్గుచు
నీ వలె నుందు నిత్యము – మహిమ కల్వరినాథుడా !