CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 139

నా మాట వినుమని ప్రభువనెను

naa maata vinumani prabhuvanenu

హెబ్రీ 3 : 8 "నేడు మీరాయన శబ్దమును వినిన యెడల . . ."

More
పల్లవి:నా మాట వినుమని ప్రభువనెను -  నిను రక్షింపను పిలుచుచుండె (2)
చరణం 1:పాపుల రక్షకుడు యేసు ప్రభుండు (2) - నీతిమంతుల కాదు పాపుల పిలిచెన్ (2) నిను హృదయంబార ప్రేమించును (2) - ప్రేమించును (1)
చరణం 2:తప్పిన వారిని వెదకవచ్చెన్ - తానే వెదకె నిన్ పరికించుము దాపున నిలిచెను రక్షింపను - రక్షింపను
చరణం 3:జీవనదాతగా ప్రభు యేసు వచ్చెన్ - నిత్య జీవము నీకు కలిగించును కావున ప్రభు నీ దరిజేరెను - దరిజేరెను
చరణం 4:జీవనజ్యోతిగా జగమునకొచ్చెన్ - నీ వెరిగితివా నీ స్థితిని నీ చీకటిని పోగొట్టును - పోగొట్టును
చరణం 5:పాత వాటిని పారద్రోలన్ - నూతన పరచును సర్వమును పరికించుము నీ స్థితిగతిని - స్థితిగతిని