CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 138

యెరూషలేము గుమ్మములారా

yerooshalemu gummamulaaraa

మత్తయి 21 : 10 "ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు ..."

More
పల్లవి:యెరూషలేము గుమ్మములారా! రాజును లోనికి రానిమ్ము (1)చిరునవ్వులతో ప్రభుయేసుని నేదే ఆహ్వానించుము (2)
చరణం 1:విజయుడై వచ్చుచున్నాడు శత్రు సాతానును ఓడించి (2) ఖర్జూరమట్టలు వస్త్రములెందుకు మీ హృదయములను పరువుడి (2)
చరణం 2:అభ్యంతరపరచకుము పిల్లలు, వృద్ధులు, యౌవ్వనులన్ ప్రభుని విజయము నందు వారిని స్తుతిస్తోత్రములు పాడనిమ్ము
చరణం 3:నీ దుష్టక్రియలను బట్టి ప్రభుని దయను త్రోసెదవా పరమ రాజును హృదయ మందిరమున నేడే రానిమ్ము స్నేహితుడా
చరణం 4:నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగా గాయపడిన హస్తమును చాచి నీ మదిలో చోటిమ్మనెను
చరణం 5:పశ్చాత్తాపము నొందుము నేడే నీ పాపము లొప్పుకొనుము జీవము రక్షణ శాంతి నొసగును ఆయనే ప్రభువు శ్లాఘించుము