పల్లవి:న్యాయపీఠము నీ ముందు వున్నదిధ్యానించి చూడు కూర్చున్నదెవరో
చరణం 1:నీవు నశించుట కోరడు ప్రభువు
ఓపికతో ఆయనే వేచి యున్నాడు
పశ్చాత్తాప పడుమిప్పుడైనా
నిశ్చయమెరుగు నరకము తప్పదు
చరణం 2:పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడో
రక్తము ద్వారా ముక్తి పొందితివా
కఠినత్వముతో తృణీకరించిన
న్యాయత్రాసు ఉన్నది రారాజు చేతిలో
చరణం 3:దాగియున్న పాపము ప్రభుయేసు చూచెను
అంధకార పాపము తన కంటపడెను
తన దృష్టినుండి తప్పించుకొందువా
తీర్పు కొడవలి తనచేత నుండగ
చరణం 4:అందరి కొరకై గ్రంథముల్ తెరువగ
వారి విషయమై వ్రాసిన రీతిన్
దేవ గొఱ్ఱె పిల్ల న్యాయము తీర్చును
తన చేతున్నది తీర్పుకై చేట
చరణం 5:క్రీస్తు యేసు నందు శిక్షా విధి లేదు
దీవెనల నొందుచు ఘనత నొందెదరు
ఎల్లప్పుడాయనతోనే - యుండెదరు
ప్రభువే నిచ్చును జీవకిరీటము