పల్లవి:ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము (2)రక్షణను పొంది - లక్షణముగా వెళ్ళుము (2)
చరణం 1:పాపమెరుగని ప్రభు నీ కొరకు - పాపముగను చేయబడెను (2)
శాపగ్రాహియాయె సిలువలో (2) పరుగిడి రమ్ము (2)
చరణం 2:ముండ్ల కిరీటమును ధరించి - ముఖముపై నుమ్మి వేయబడె
ప్రాణమిడె నేసు సిలువలో - పరుగిడిరమ్ము
చరణం 3:సిలువలో నీకై దప్పిగొని - కలుష నీక్షమకై ప్రార్థించి
సహించి ప్రాణమిదె నీ కొరకు - పరుగిడి రమ్ము
చరణం 4:తప్పిన గొర్రెను రక్షింప - తనదు రక్తమును చిందించె
కాపరి స్వరము ధ్వనించె - పరుగిడి రమ్ము
చరణం 5:తామసించ తగదిక ప్రియుడా - త్వరపడుము నీ రక్షణ కొరకు
నేడే నీ రక్షణ దినము - పరుగిడి రమ్ము
చరణం 6:తానే కడుగును తన రక్తముతో - తండ్రివలె నీ పాపమునంత
తనయుడవై పోదు విపుడే - పరుగిడి రమ్ము
చరణం 7:ప్రేమవార్త ప్రకటించబడె - ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము
కృపా కాలమిదే జాగేల - పరుగిడి రమ్ము