పల్లవి:ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు సమమెవరు? (2)ప్రేమయె తానై నిలిచి - ప్రేమోక్తులనె పల్కి (1)ప్రేమతో ప్రాణము బెట్టి (2) - ప్రేమనగరికి చనియె (2) ||ప్రేమా||
చరణం 1:నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేది
ప్రేమద్రోహులే గాని - ప్రియమున జేరరు వాని
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా
చరణం 2:ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారా
పాపభారముతో రారా - పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు
చరణం 3:ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల
రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము