పల్లవి:ఓ పాపీ - సంధించితివా! - నీ పాప - విమోచకునినీ పాపముల్ - క్షమించి - నీ ప్రాణమునకు శాంతి నొసగున్
చరణం 1:బంధింపబడె - ప్రభువైన యేసు - విడుదలజేయనిన్ను (2)
నిందను పొందెను - పొంద నీ వానందము (2)
చరణం 2:క్రీస్తు యేసు నీ కొఱకేడ్చె - గెత్సేమనే - వనములో
వాత్సల్యముతో - నిన్నానందింపజేయ
చరణం 3:రక్షకుడు - తీర్పు కై నిలచె - అక్షయ జీవమీయ
శిక్షను బొందె - నిన్నానందింపజేయ
చరణం 4:ప్రభువైన యేసు - తట్టుచున్నాడు - నీ హృదయ ద్వారమున్
అబ్బును శాంతి - తెరచిన హృదయమున్
చరణం 5:జీవజలమిచ్చు - ప్రభువైన యేసు - దప్పిగొనియున్న నీకు
జీవితాంతము వరకు - దప్పిగొనవేమాత్రము
చరణం 6:రక్షణ దుర్గమున నిన్నుంచి - శత్రువును - అణచివేసి
దక్షిణ హస్తముతో - కప్పును - నిన్నెప్పుడు
చరణం 7:దేవుని స్వరము - వినుడి నేడే - దైవపుత్రులౌదురు
సేవించుడి క్రీస్తుని - జీవతములర్పించి