పల్లవి:జీవిత మేమెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి ?ఈ లోకములో జీవించు జీవితమంతజీవితమెవ్వరిది, నీ జీవితమెవ్వరికి? (1)
చరణం 1:శరీరేచ్ఛల పై ఆశలుండు (1) - ఈ ధరణియందు (2)
సుఖభోగులుగా జీవింతురు (1) - ఈ ధరణియందు (2)
వారి యూహలు దినమెల్ల చెడియున్నవి (2)
వారి పాప జీవితమంత శాపమెగ (2)
చరణం 2:ధనాపేక్షకులెందరో గలరు - ఈ ధరణియందు
ధనముపై మనస్సు నిల్పెదరు - ఈ ధరణియందు
వారి కలవరమంత ధనము ధనమే
వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే
చరణం 3:స్వంత బోధలకై బ్రతికెదరు - ఈ ధరణియందు
గర్వమునకు అమ్మబడి యుందురు - ఈ ధరణియందు
వారి మనసులు సంకుచితములై యుండు
వారి జీవిత ప్రయాసము - పతనమేగా
చరణం 4:విరిగిన హృదయులు కలరెందరో - ఈ ధరణియందు
కరిగెడు ఉప్పుగ నుండెదరు - ఈ ధరణియందు
వారు ప్రభుకై దాగియే నిలచెదరు
దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు