పల్లవి:మనకై యేసు మరణించె మన పాపముల కొరకై (1)నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2)
చరణం 1:తృణీకరింపబడె - విసర్జింపబడెను (2)
దుఃఖా క్రాంతుడాయె (2) - వ్యసనములు భరించెను (2
చరణం 2:మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే - మన ముఖములద్రిప్పితిమి
చరణం 3:మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగెన్
చరణం 4:గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్
అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును
చరణం 5:దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
తన నోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్
చరణం 6:ఎదిరింపలే దెవరిన్ - లేదే కపటము నోట
యెహోవ నలుగ గొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్
చరణం 7:సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ