పల్లవి:ఇదియే సమయంబు రండి యేసుని జేరండి (1)ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి (2)
చరణం 1:పావులనందరిని తన దాపున జేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా (2)
మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా (2)
చరణం 2:రాజులకు రాజైన యేసు రానైయున్నాడు
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
తరుణముండగానే - మీరు తయ్యారవ్వండి
చరణం 3:బుద్ధిలేని కన్యకలవలె మొద్దులు గానుంటే
సిద్దెలలోని నూనెపోసి సిద్ధపడకపోతె
తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి
చరణం 4:వెలుపట నుంటేనూ మీరు వేదన నొందెదరు
ప్రభువా ప్రభువనుచు - యెలుగెత్తి పిలచినను
మిమ్మును ఎరుగనూ మీరెవరో పొమ్మనును
చరణం 5:నమ్మిన వారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగా
నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా
నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి
చరణం 6:సందియపడకండి మీరు సాకులు చెప్పకను
సత్యవాక్యమును మీరు సరిగా చూడండి
మరణ దినమును మన మెరుగము సుమ్మండి
చరణం 7:జాలము చేయకను మీరు హేలన చేయకను
కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను
తరుణముండగానే మీరు త్వరపడి రారండి