CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 13

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు

needu vishvaasyata maa prabhu yesu

ద్వితీ. 7 :9 ; కీర్తనలు 36 :5 ; 1 థెస్స. 5 : 23, 24 ; విలాప . 3:23 "యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది."

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీదు విశ్వాస్యత మా ప్రభు యేసుఅంతరిక్షము నధిగమించెను (2)
చరణం 1:నిను ప్రేమించి నీ ఆజ్ఞలను - అనుసరించు మనుజావళికి (2) నిబంధనను స్థిరముగ జేసి (2) నిరతము నలరారెడు మా ప్రభువా (2)
చరణం 2:వేయితరముల వరకు సరిగా - విలసిల్లేటి వెలలేని మా వింతల కృపాంబుధి యగు దేవా యెంతయో నిను స్తుతియింతుము కోరిc
చరణం 3:నీ సత్య సంధత్వ మహిమ - నిరతము నిలయం సంస్తుతులకు మెరసెను నా మదిలోన దేవా మరువగ లేమీ మధురప్రేమ
చరణం 4:ఎంతైనను నమ్మదగిన - వింతైన నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగ ప్రతిదినము యేసుప్రభో
చరణం 5:మన ఆత్మను జీవము దేహమును - మన ప్రభు యేసు రాకడవరకు ఒనరుగ కాపాడును పదిలముగా దినదినమును నిందారహితముగ
చరణం 6:తండ్రి కుమార శుద్ధాత్మకును - తరతరములకు మహిమ ఘనత పరిపూర్ణముగా ప్రబలును గాక పరిపరి విధముల ప్రభు సంఘములో