CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 12

ఆరాధించెద నిను మది పొగడెద

aaraadhincheda ninu madi pogadeda

యోహాను 12:3 “ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను”

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆరాధించెద నిను మది పొగడెద - నిరతము నిను స్తుతియించెదను(2)మార్గము నీవే సత్యము నీవే (2) - జీవము నీవే నా ప్రభువా (2)
చరణం 1:విస్తారంబగు వ్యాపకములలో - విడిచితి నీ సహవాసమును (2) సరిదిద్దితివి నా జీవితమును (2) నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా (2)
చరణం 2:నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితిని నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా
చరణం 3:వ్యర్థపరచితిని నా సర్వమును - స్వార్థముతో జీవించితిని గుర్తించితిని నీ త్యాగమును వినయముతో నీ సన్నిధి చేరి
చరణం 4:నీ రక్తముతో నన్ను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను
చరణం 5:దుర్గంధముతో నిండిన నన్ను - దయతో నీవు పిలిచితివి ప్రేమతో పరమ విందు నొసంగి ఆనందింపగ జేసిన ప్రభువా
చరణం 6:ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నేనెన్నగ తరమా నా జీవితమున చాలిన ప్రభువా
చరణం 7:పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలచినను లెక్కింపగ జాలని జనమందున నను గుర్తింతువు నా ప్రియప్రభువా