పల్లవి:సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని (2)
చరణం 1:యేసుని రాజ్యము - సమయము వచ్చెను (2)
రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన (2)
చరణం 2:మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను
తనదు రక్తము ద్వారానే - పాపబంధము త్రుంచెను
చరణం 3:కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను
ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను
చరణం 4:సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే
సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము
చరణం 5:పాప సాగరమునందు ఎంతకాలముందువు?
పాపసాగరము నుండి - యేసుప్రభు విడిపించును