పల్లవి:సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగునుప్రియుడా పాపమును కడుగును
చరణం 1:చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించె యీ జగతిన్
ప్రియుడా ప్రేమించె యీ జగతిన్
సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు
యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను
చరణం 2:లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చె
ప్రియుడా ప్రాణము బలిగానిచ్చె
లోకపాపమెల్ల సిలువలో మోసి
తొలగించె శాపమున్ ప్రియుడా తొలగించె శాపమున్
చరణం 3:వినుము సోదరా ప్రభుయేసు క్రీస్తుని పరలోక వార్తను
ప్రియుడా పరలోక వార్తను
ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించు చుంటిమి ప్రియుడా చాటించు చుంటిమి
చరణం 4:యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో
ప్రియుడా విరిగిన హృదయముతో
యేసుని అమూల్య రక్తధారలే
కడుగును పాపమెల్ల ప్రియుడా కడుగును పాపమెల్ల
చరణం 5:పాపభారమును మోసికొని నీవు ప్రయాస మొందెదవా?
ప్రియుడా ప్రయాస మొందెదవా?
పాపమొప్పుకొని యేసు పాదముల
చెంతకు జేరుము ప్రియుడా చెంతకు జేరుము
చరణం 6:గతించుచున్నది స్వల్ప జీవితం శీఘ్రముగా రమ్ము
ప్రియుడా శీఘ్రముగా రమ్ము
కర్త యేసునందు విశ్వాసముంచి
రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము
చరణం 7:కృపాయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము
ప్రియుడా భాగము పొందుము
పాప సాగరమును దాటించగలడు
యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకు