పల్లవి:శ్రమలను పొందె శ్రీయేసుడు నీ కొరకై సిలువలో (2)
చరణం 1:సదయుడు ప్రేమించె - శత్రువైన నిన్ను
దూరస్థుడవైన నీ యెడల - దయచూపించె (2)
వహించె నీ శాపం భరించె నీ పాపం (2)
నీ మనస్సు మార్చుకొనిన - సంతసించును ప్రభుయేసు (2)
చరణం 2:దొంగవై నీవున్నా - దురితంబులెన్నున్నా
దోషంబుల క్షమియించు - తన సిలువ రక్తముతో
తెరచెనుగా నీ కొరకు - పరలోక ద్వారము
నెమ్మది నిచ్చును నీకు - యేసుని విశ్వసించిన
చరణం 3:ఎవరేసు రక్తములో - కడుగబడెదరో
వారే చేరెదరు - తన సంఘము నందు
అంగీకరించుము - యేసును నీవు
కలిగించు నీకు తృప్తిని - నేడే నీ వాయనను వేడు
చరణం 4:సిలువపై యేసు - సర్వ మర్పించె
నీ రక్షణ కొరకు - క్రయము చెల్లించె
యేసునకు నీవు - ఏమియ్యగలవు?
తెరువు నీ హృదయ ద్వారమును - నేడే ప్రవేశించును తాను