పల్లవి:ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2)ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు (2)అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2)
చరణం 1:జీవితయాత్ర యెంతో కఠినము (2) ఘోరాంధకార తుఫాను లున్నవి (2)
అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2) , కాయువారెవరు రక్షించేదెవరు (2)
చరణం 2:హృదయము శుద్ధి పరచుకొన్నాను - నా చేతులెంతో పరిశుద్ధ పరచ
అనుకొనని రీతి అపవాది వచ్చి - నా జీవితమును నిరాశపరచె
చరణం 3:నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా - అనుదినము నన్ను ఆదరించెదవు
నీతో వున్నాను విడువలేదనెడు - నీ ప్రేమ మధుర స్వరము విన్నాను
చరణం 4:ఈ అనుభవముతో నేనడచుకొందు - ప్రియయేసువైపు నేను చూచుచు
గతమునంత నేను మరచిపోయెదను
కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు
చరణం 5:తోడైయుండెదవు అంతము వరకు - నీవు విడువవు అందరు విడచినను
నూతన బలమును నా కొసగెదవు
నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే