పల్లవి:ప్రభుని దర్శనం యేసుని దర్శనమొంది సేవ - చేయుము దేవునికి (2
చరణం 1:ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను (2)
పాప సముద్ర - పాప సముద్ర
అగాధములో ఆత్మలు మునిగెను (2)
చరణం 2:సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై
తన హృదయములో - తన హృదయములో
ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను
చరణం 3:యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి
రక్షకుడేసుని - రక్షకుడేసుని
తక్షణమే లేచి సేవించుమా
చరణం 4:ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా
విస్తారముగా - విస్తారముగా
కోత యున్నది - నూతన బలమున రా