పల్లవి:నిశ్చయముగ నిన్ను దీవించెదను (2)", "నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)
చరణం 1:ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తి గల యెహోవాను నేను (2)
నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన (2) - నీతో నిబంధన నియమింతును (2)
చరణం 2:నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదను
నీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున
చరణం 3:యుగ యుగములు నీకు దేవుడను - కనాను దేశము నీ కొసగెదను
నిత్య స్వాస్థ్యమును నీ కొసగెదను నీలో మహిమ నే పొందెదను
చరణం 4:గొప్ప జనముగా జేసెద నిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్
నీ నామమును గొప్ప జెసెదను - ఆశీర్వాదముగ జేసెదను
చరణం 5:నిన్నాశీర్వదించు వారిని - నేను ఆశీర్వదించెదను
దూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు