పల్లవి:ఆనంద మహానందం ప్రభువే మనకానందం (1)మనయందు నిలిచి యుండును పరలోకపు ఆనందం (2)
చరణం 1:దూతలు తెచ్చిరి శుభవార్త యెంతో గొప్పానందము (2)
కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే (2)
చరణం 2:ఆనందించుడనె ప్రభువే పరమందున మీ పేరుల్
గొఱ్ఱె పిల్ల జీవగ్రంథమందు వ్రాయబడియున్నవని
చరణం 3:నీ సన్నిధియందే కలవు నిత్య సంతోషములు
నీ చిత్తము నెరవేర్చువారెల్లరు ఆనందించెదరు సదా
చరణం 4:ఇదివరకును మీరేమియును అడుగ లేదు నన్ను
మీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను
చరణం 5:యెహోవా విమోచించిన వారె పాటలు పాడి
శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు
చరణం 6:ఆయన కొరకవమానమును మరినిందకు పాత్రులము
తన వాక్యమెవ్వరి మదియందుండునో సంతోషింతురు మిగుల
చరణం 7:ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు
సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయ పాడెదరు