CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 107

నేనే భయపడ వలదని పలికెను

nene bhayapada valadani palikenu

2 పేతురు 1 : 3 "మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక."

More
పల్లవి:నేనే భయపడ వలదని పలికెను",            "మన రక్షకుడు యేసు ప్రభూ (2)
చరణం 1:తన సమాధానము నీకిచ్చి - కృపల నెన్నో చూపెనుగా (2) తనివితీరస్తుతి చెల్లించుము - తనదు ప్రేమా దయకొరకు (2)
చరణం 2:శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి విశ్వాసముతో నిలిచిన యెడల - శాశ్వత రాజ్యంబొసగు
చరణం 3:నరుడు కాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు కరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు
చరణం 4:మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్ త్వరగా వచ్చును కనిపెట్టుము - నిరతమాయన తోనుండ
చరణం 5:ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచో వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె
చరణం 6:నీ యాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహ రక్తమును ముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము