CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 105

ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను అ.. అ..

idigo nenoka nootana kriyanu cheyuchunnaanu a.. a..

యెషయా 43:19 “ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను”

More
పల్లవి:ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను అ.. అ.. (2)
చరణం 1:అడవిలో త్రోవను జేసి - ఎడారిలో నదులను నేను ఎల్లప్పుడు సమృద్ధిగా - ప్రవహింప జేసెదను
చరణం 2:నాదు ప్రజలు త్రాగుటకు - నేనరణ్యములో నదులు సమృద్ధిగా పారునట్లు - సృష్టించెదను నేను
చరణం 3:అరణ్యములో జంతువులు - క్రూరపక్షులు సర్పములు ఘనపరచును స్తుతియించును - దీని నాలోచించుడి
చరణం 4:నూతన సృష్టి గ నినుజేసి - నీ శాంతిని నదివలెజేసి ననుజూచి మహిమపరచి - స్తుతిబాడ జేసెదను
చరణం 5:నేనే దేవుడనని దెలసి - నా కార్యములను నెరవేర్చి ముందున్న వాటికన్న - ఘనకార్యములను జేతున్
చరణం 6:మరుగైన మన్నానిచ్చి - మరితెల్లని రాతినిచ్చి చెక్కెదనా రాతిమీద - నొక క్రొత్త నామమును
చరణం 7:పరలోక భాగ్యంబులు - నరలోకములో మనకొసగెన్ కరుణా సంపన్నుడగు - మన ప్రభునకు హల్లెలూయ