CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 104

మనమే ప్రభుని పరలోక గృహము

maname prabhuni paraloka gruhamu

ఎఫెసీ 2:19 "కాబట్టి మీరిక మీదట.... దేవుని యింటివారునై యున్నారు."

More
పల్లవి:Maname prabhuni paraloka gruhamu - tane nasinchunu daniyandu (2)
చరణం 1:ఎంత సుందరమో ప్రభునిగృహము (2) - నలుదిక్కులనుండి కూర్చెనుగా (2) ఏక శరీరము రక్తబంధముచే (2) వేలాది భాషల నుండినను (1)
చరణం 2:ఒక నూతన వ్యక్తిగా మము జేసే - పరమ గృహమునకు చెందితిమి ఐక్యతతో స్థిరముగ నమర్చబడిదేవుని గుడారముగా నైతిమి
చరణం 3:నల్లని తెల్లని వారని లేదు - ధనికులు దరిద్రులనియు లేదు పామరులని జ్ఞానులనియు లేదు యేసు ప్రభువే సర్వముగా
చరణం 4:ప్రభుని గృహమున కలహము లేదు - ఈర్ష్య కపట భేదము లేదు శాంతి ఆనందము నిజ ప్రేమయుండును నేర్పుతో నడుపును మన ప్రభువే
చరణం 5:ప్రభుని గృహము యిద్దరయందున్నది - తన దాసుల కధికారమిచ్చె ప్రతివానికి వాని పని నియమించె కావలి యుండుము మెలకువతో
చరణం 6:దృఢ విశ్వాసము మదినందుంచి - విజయులై యాత్రలో సాగెదము ఆదర్శులమై ఈ జగమందున పూర్తిగా శత్రువు నోడింతుము
చరణం 7:ప్రియుని దినము సమీపించుచున్నది - చెప్పెను మేల్కొని యుండుమని విశ్వాస యోగ్యులముగ జీవించి వేచియుండెదము