CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 103

విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురక్షకా

viduvavu nannika ennadainanu - padipokundaa kaayurakshakaa

కీర్తనలు 145 : 14 "యెహోవా పడిపోవు వారినందరిని ఉద్ధరించి లేవనెత్తువాడు"

More
పల్లవి:విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురక్షకా (2)పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభూ (2)
చరణం 1:ప్రభువా నీకవిధేయుడనై - పలుమారులు పడు సమయములో (2) ప్రేమతో జాలి దీన స్వరముతో - ప్రియుడా నను పైకెత్తితివి (2)
చరణం 2:ఆదాము హవ్వలు ఏదేనులో - ఆశతో ఆజ్ఞమీరినను సిలువకు ఛాయగ బలి నర్పించి - ప్రియముగా విమోచించితివి
చరణం 3:మోషేకు నీ దర్శనమిచ్చి - నీ ప్రజలను నడిపించుటకై సాకులు చెప్పిన విడువక తననే - నాయకునిగ నియమించితివి
చరణం 4:స్వంత తలంపున దావీదు - మందసమును తెచ్చునపుడు ఉజ్జా మరణముచే దావీదు - హృదయమును కదిలించితిని
చరణం 5:నీ మాటలు వినక యోనా - తర్షీషుకు తరలినపుడు సముద్రములో ముసుగుచుండగ - చేపద్వారా దరిచేర్చితిని
చరణం 6:నిన్నెన్నడు యెడబాయనని - నిక్కముగ పేతురు పలికె ముమ్మారు బొంకినను విడువక - ప్రేమతోను రక్షింతిని
చరణం 7:మా శక్తియు మా భక్తియు కాదు - ఇలలో జీవించుట ప్రభువా కొల్లగ నీ ఆత్మను నొసగితిని - హల్లెలూయ పాడెదను