CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 102

నీ రక్తమే – నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్

nee raktame – nee raktame - nan shuddheekarinchun

1 యోహాను 1: 7 "ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును".

More
పల్లవి:నీ రక్తమే – నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్ (1)నీ రక్తమే నా బలము (1)
చరణం 1:నీ రక్తధారలే యిల - పాపికాశ్రయంబిచ్చును (2) పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచుము (2)
చరణం 2:నశించువారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది
చరణం 3:నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే పాపవిముక్తి జేసితివి - పరిశుద్ధ దేవ తనయుడ
చరణం 4:పందివలె పొర్లిన నన్ను - కుక్కవలె తిరిగిన నన్ను ప్రేమతో జేర్చుకొంటివి - ప్రభువా నీకే స్తోత్రము
చరణం 5:నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే
చరణం 6:స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును