CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 861

ఆర్భాటముతోను ప్రభావముతోను

aarbhaatamutonu prabhaavamutonu

More
పల్లవి:ఆర్భాటముతోను ప్రభావముతోను - మేఘారూడుడై యేసు వేగమే రానుండే
అను పల్లవి:మేల్కొనుమా ప్రియ సంఘమా - సిద్ధపడుమా పరిశుద్ధ జనమా (2)
1. పాపముల క్షమియించి శుద్ధి చేసెను - పరలోక పౌరులుగా మనల జేసెను (2) సువార్తను ప్రకటింప ఆజ్ఞ యిచ్చెను - సంఘమును కట్టుమని సెలవిచ్చెను (2)
2. స్థలమును సిద్ధపరచ వెళ్లెను యేసు - తానుండు స్థలములో మనముండునట్లుగా హృదయమును కలవరపడనియ్యకు యేసునియందు విశ్వాసముంచుమా
3. పడిపోయిరి మా బలాఢ్యు లెందరో - ఇశ్రాయేలు నీ సుందర పర్వతముపై మంచైననూ, వానైన కురువదింకనూ పర్వతములన్నియూ పాడైపోయెను
4. యెట్లు వెళ్ళేనో యేసు అట్లే వచ్చును - ప్రతి నేత్రము ఆయనను చూచును భూజనంబులెల్ల రొమ్ము కొట్టుకొందురు - సిగ్గుతో ముఖములెల్ల తెల్లబారును
5. ఆయన ప్రత్యక్షత నపేక్షించుమా - పానార్పణముగా పోయబడుదుమా నిందలను శ్రమలను సహియింతుమా - నీతికిరీటము పొంద పోరాడుదమా

Back to Hebron Seeyonu Geethalu