CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 863

పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము

parishuddha sthalamu ati parishuddha sthalamu

More
పల్లవి:పరిశుద్ధ స్థలము - అతి పరిశుద్ధ స్థలము (2) దేవాదిదేవుడున్నట్టి స్థలము (2)అతి పరిశుద్ధంబైన పరలోకము (2)
1. ప్రభు యేసు వచ్చెను ఆ స్థలమునుండియే - స్థలము లేనివాడుగా ఈ భువిపై నుండెను (2) ప్రాణము నర్పించెను కలువరి కొండపై (2) శత్రు గర్వమణచను సజీవుడై లేచెను (2)
2. ప్రభుయేసు వెళ్లెనటకు స్థలము సిద్ధపరచను - ఆయనుండు స్థలములో మనముండవలెనని శోధన వేదన భాద లేని స్థలమది ఆ స్థలమునకెళ్లుటకు ప్రయాసపడుదమా
3. అబ్రహాము చూచెను ఆ స్థలమును - మోషే చూచి వచ్చెను దాని వైభవంబును హానోకు ఏలీయాలు వెళ్లిరి అటకు పౌలు చూచి వచ్చెనా మహిమకర స్థలమును
4. సూర్యచంద్రులక్కర లేని స్థలము అది - పాపము చీకటి చొరని శుద్ధ స్థలమది గొర్రెపిల్ల దీపమై వెలుగునిచ్చు నచట జయశాలులెల్లరూ సంచరింతురచట
5. జీవవృక్షఫలములు దొరకునట్టి స్థలమది - జీవనది పారుచుండు నెల్లవేళలా నిశేధించ బడినవారు చొరని స్థలమది నిత్యజీవమొందువారే ప్రవేశింతురందున
6. పండ్రెండు పునాదుల పట్టణము అది - పండ్రెండు ముత్యములతో కట్టబడినది పండ్రెండు గుమ్మముల ప్రాంగణమది హల్లెలూయ పాడుచూ ఆరాధింతుమచట

Back to Hebron Seeyonu Geethalu