పల్లవి:ఇదిగో ఈ మనుష్యుడు - దేవుని కుమారుడుపరము నుండి ధరణికి - నరుడై అరుదెంచినపరిశుద్ధ దేవుడు - హల్లెలూయ - శ్రీయేసునాధుడు
1. ఆద్యంత రహితుడు అల్ఫా ..... ఓమేగా తానే ఆదిసంభూతుడు - అసమానుండైన క్రీస్తు - సర్వలోకమునకై గొర్రెపిల్లగ బలియై - మృతుల నుండి లేచిన సజీవుడు
2. భూమ్యాకాశముల కర్త - భూజనుల రక్షణకర్త సర్వసృష్టి కర్త - సమాధాన కర్త - పాపవిముక్తికై - రక్తము చిందింప అభిషిక్తుడైన క్రీస్తేసుడు
3. ఈ ప్రభువే స్తోత్రార్హుడు - ఆరాధనకు పాత్రుడు రాజుల రాజు యేసు - ఎబినేజరై యున్నాడు నజరేయుండగు యేసు - విజయుండైలేచెను నిజరక్షకుండని భజియింతుము
4. తండ్రి మహిమను విడచెను - మరణ పధమున నడిచెను శ్రీమంతుడైన ప్రభువు - మనకై దరిద్రుడాయెన్ మారుమనస్సు పొంద - కనికరమున మన్నించి నీతిగతీర్చిన ప్రేమామయుడు
5. రారాజై రానున్నాడు - యుగయుగముల రాజ్యమేలన్ న్యాయాధిపతిగ వచ్చున్ - అందరికీ తీర్పు తీర్చన్ ఇహపరములకు - ఘనతమహిమలకు ప్రభువుల ప్రభువనుచు ప్రణుతింతుము