పల్లవి:మానవా మరలి రా ప్రభు చెంతకు చేరవా?ప్రభు పిలిచే తరుణములోన - రక్షించు నిను నేదైనా (2)
1. హృదయములో నెమ్మది లేక - వేసారి విసిగిన బ్రతుకా కడసారి నిరీక్షణ ఇదియే - యేసయ్య కలువరి సిలువే
2. చుట్టుముట్టాయి వ్యాధులు వరుస దిక్కుతోచని మరణపు పడక కడసారి నిరీక్షణ ఇదియే - యేసయ్య కలువరి సిలువే
3. పాప భారము తోడ నిండి - పగిలి పోతున్న నీ జీవ పాత్ర కడసారి నిరీక్షణ ఇదియే - యేసయ్య కలువరి సిలువే
4. నా కత్తికి ఎదురులేదని - విర్రవీగి తిరుగుచునుంటే గర్వంబు నణచును యేసు - విరిగిన హృదయముతో తిరుగు
5. కల్వరిలో నీ కొరకేసు - రుధిరంబు చిందించినాడు జాలిగ పిలిచే నిను ప్రభువు - విలువైన రక్షణ నివ్వ