పల్లవి:గుణాతిశయముల నే పాడెదను (2) స్తుతి ప్రశంస నే చేసెదను (2)గుణాతిశయముల నే పాడెదను (2)
1. పాప సాగరములో నే మునుగు చుంటి నా కన్నీటిని నే త్రాగుచుంటి నాదు హృదయము బహు వ్యాకుల మొందె (2) ఆ సమయములో - ప్రభు నాకు దొరికె (2) నన్నాదరించి - తన యింట చేర్చెను (2)
2. హృదయ పాపములన్ని - కడిగె రక్తముతో నిత్య రాజ్యమునకు - పాలివానిగా జేసె శాంతి ఆనందముతో - ప్రభు నన్ను నింపెను నిత్య జీవ వరము - నాకనుగ్రహించెను తన చెంతకు నన్ను - చేర్చెను ప్రభువు
3. తిరిగి లేచి ప్రభు - వెళ్లెను పరముకు సిద్ధపరచుచుండె - నాకై స్థలమును నన్నుకొని పోవ - ప్రభు తిరిగి వచ్చును విడిపించును నన్ను - ప్రతి దుఃఖము నుండి ఈ నిరీక్షణతో - జీవించుచున్నాను