పల్లవి:వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా (2)దీన మనస్సుతో - నిన్నే కొలుతునయ్యా (2)
1. నే ఘోర పాపిని - అయుండగానె నా కొరకై క్రీస్తు - ఈ భువికరుదెంచె నన్ను రక్షించుటకై సిలువలో మరణించె (2) తన రక్తముతో నా పాపము కడిగె (2)
2. నీ హృదయములో - కలవర పడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాననిన - నా యేసు ప్రభువా వాగ్దానమును - ఇచ్చిన ప్రభువా
3. పూర్ణ హృదయముతో నిన్నారాధింతును పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లింతును హృదయమారా నిన్నే సేవింతును