పల్లవి:నా ప్రాణ ప్రియుడా - నిన్నే స్తుతింతున్ - నా హృదియార - నిన్నే ఘనపరతున్నా నిరీక్షణకు - ఆధారం నీవే (2) - ఎల్లకాలం నిన్నే - ఆరాధింతున్ (2)
1. పాపపాశములు నను చుట్టుముట్టి - నిత్యానాశనమునకు చేరువకాగా (2) పావనుడేసు నా కట్లుత్రెంచ (2) - సిలువలో బలియాయె (2) గొప్ప రక్షణను నాకిచ్చెనని - కొనియాడెదన్ (2)
2. నాదు జీవిత యాత్రలో నాకు - జీవపు వెలుగు నీవైతివి నాదు కష్టసమయంబులలో - ఆశ్రయ దుర్గమైతివి నాదు కాపరివై జీవమార్గములో - నడిపితివే
3. అలలు నన్ను ముంచజూచినను - బలుసు భయపడవద్దనెను తల్లడిల్లకుండ స్థిరపరచె నన్ను - తన సాక్షిగా నిలిపే సజీవయాగముగా నన్నే నీకు - అర్పించెదన్
4. తల్లిదండ్రులు నన్ను విడిచినను - • కన్నీళ్ళు నా కంట రాలినను కలవరపడకు అంటివి ప్రభువా - కరుణను జూపితివే కరములు జోడించి పూజించెద నిన్ను - నా ప్రభువా
5. నిన్ను విడువను ఎడబాయవంటివి - నీ అరచేతిలో చెక్కిన ప్రభువా అందరు మరిచిన మరువని దేవా - పొగడక ఎట్లుందున్ పరిశుద్ధులందరితో హల్లెలూయ పాడుచు కీర్తింతున్