CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 788

సంపూర్ణ జ్ఞానము కలిగి

sampoorna jnyaanamu kaligi

More
పల్లవి:సంపూర్ణ జ్ఞానము కలిగి - ఆత్మఫలము నందు అభివృద్ధి నొందుడిసంపూర్ణ జ్ఞానము కలిగి (1)
1. క్రీస్తేసునందు మనకు పాప- క్షమాపణ కలిగెను (1) అంధకార సంబంధమైన - అధికారములనుండి విడుదలదొరికె (2) ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడుచుకొనుము (2) నీవు ప్రేమను కలిగి యుండుము. (2)
2. ప్రభు యేసు అదృష్యుండైన - దేవుని రూపము గలవాడు సర్వసృష్టికి కర్తయు తానే - నిన్ను నూతన సృష్టిగా జేసె ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడచుకొనుము నీవు ఎల్లప్పుడు ఆనందించుము
3. మృతులలో నుండి మొదట లేచె - యున్నవాడు యేసుప్రభు మనలను తండ్రి రాజ్యమునకు - వారసులుగా జేసియున్నాడు ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడచుకొనుము నీవు ఏలనిమ్ము సమాధానము
4. క్రీస్తేసునందు సర్వసంపూర్ణత - నిండి యున్నది సిలువ మరణము ద్వారానే మనల - తండ్రితో సమాధాన పరచే ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడుచుకొనుము నీవు దీర్గశాంతము కలిగి యుండుము
5. సమస్త సృష్ఠికి ప్రకటింప బడిన - సువార్తను విడువక విశ్వాసమందు నిలిచిన యెడల - నీవామహిమను పొందెదవు ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడచుకొనుము నీవు దయాళుత్వము కనుపరచుము

Back to Hebron Seeyonu Geethalu