CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 787

ఒప్పుకొంటి ఒప్పుకొంటి

oppukonti oppukonti

More
పల్లవి:ఒప్పుకొంటి ఒప్పుకొంటి - నా తప్పిదములన్ని చెప్పి చెప్పి యేసుతో -ఒప్పుకొంటి ఒప్పుకొంటి (1)
1. ఉదయముననే లేచి - గాంచితి పొగబండి ఏర్పరచ బడిన - వారికే తగుబండి అది విని చెప్పితి - వచ్చెద పాపిని మన్నించుమని నేను - మొరపెట్టితిని ప్రభుతో
2. సుందరమగు మంది - రమునకు నే చేర చూచితి మరి వింటి - బాలబాలుర మధ్య ఏర్పరచ బడిన వాడవేనా నీవు ? ఎటు చూచినను గాని - ఒకటే స్వరము వింటి
3. సత్యముగల బోధ- విప్పెను నా గాథ ముత్యములగు మాట - తెల్పెనా ప్రభు బాధ గెత్సెమనే తోటన్ - ఏడ్చిచెప్పిన మాట చాటించెదను ప్రభువా - ప్రకటింతు ప్రతిచోట
4. గొట్టెమందల గాచే - అడవిలో మన మోషే మొఱ్ఱపెట్టుచు గడిపే - సర్వము విడె మోషే సర్వకళాశాల జ్ఞానమెందుకు నాకు సర్వవ్యాప్తి దివ్యస్వరమే చాలనే మోషే

Back to Hebron Seeyonu Geethalu