పల్లవి:ప్రభువుకు తగినట్టు - పృథివిలో ప్రియుడా - పదిలముగా జీవించవా? (2)
1. ఆదామవ్వలవలె నీవు సహ - కేవలము దిగంబరివైయుండ (2) ఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలో పావన వస్త్రముల నిచ్చెను (2)
2. శ్రేష్ఠబలి నిచ్చి హేబెలు - సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా - హతసాక్షిగా నీ వుండెదవా?
3. ప్రభు యడుగుజాడలను పరికించి ప్రభు - కనుకూలంబుగా నడచినచో హానోకువలె ఆ రెండవ మరణము - నొందక ప్రభుతో నుండెదవు
4. పరిశుద్ధమైన ప్రవర్తనలో- ప్రభు సర్వాంగ కవచముల్ కల్గి నీతిన్ ప్రకటించిన నోవహున్ బోలి - ఖ్యాతి సువార్తన్ చాటు మిలన్
5. మృతులను సహలేపు మహాత్మ్యుడని - తన సుతునర్పించె నబ్రాహాము మృతికి లోనగు నీ శరీరంబును - అతనికె బలిగా నర్పించు
6. తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు - మౌనమున్ జూపి మరణము గోరె కడు శ్రమకాలములో ఖండించె ఖడ్గము - ముంగిట నీవట్లుండెదవా?
7. యెహోవా భయము నొంది యోసేపు - ఎంత వైభవ మనుభవించెనో గాంచు నీ జీవితంబులో దైవ భయము నొంది - అక్షయ కిరీటమున్ బొందు