CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 753

యేసుని శిష్యులము

yesuni shishyulamu

Acts 17:6

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసుని శిష్యులము యేగుదము - పిశాచి లోకమును కదలింతుము (2)
1. గాఢనిద్రపోతులను లేపెదము (2) దాహము గలవారలకు సాక్ష్యమిత్తుము (2) వేగముగ దేశద్రిమ్మరిని పార ద్రోలుచు - త్యాగు డేసుక్రీస్తుని సిలువచే (2)
2. అహంకారుల నెల్లర చేర్చెదము మహా ముత్యములను వెదజల్లెదము మా దుఃఖములెల్ల సహించెదము - నెచ్చెలుడు యేసుక్రీస్తుని సిలువచే
3. ఒక్కడేయగు తండ్రి బిడ్డలారా చక్కగా నొక్కటిగ నుండువారలారా ఎప్పుడును మంచి మనస్సుతో నడువుడి - మన రాజగు యేసుని సిలువచే
4. వచ్చు బాధలనన్ని సహించెదము గొప్ప పాతక క్రియల రూపార్చెదమురిక్తుడైన మన నాథుని చాటుదము - శక్తి రాజుని శాంతి సిలువచే
5. ప్రజల నెల్లర శిష్యుల గావింతుము తేజో మయుడైన తండ్రిని ప్రకటింతుము ఎల్లవారికి స్వాగత మొనరింతుము - బోధకుడు యేసుక్రీస్తుని సిలువచే
6. ఆది యపోస్తలుల సభను యేర్పరచి దిట్టముగ తప్పుబోధల విడచెదము ఎప్పుడును ఒప్పుగానే నడచెదము - గొప్పతండ్రి యేసుక్రీస్తు సిలువచే
7. హల్లెలూయ గీతమును మ్రోగింతుము మేలుగల్గ దుష్టక్రియల నణచెదము వల్లభుడు క్రీస్తు వార్తకు లోబడుచు - చల్లని నాథుడేసుని సిలువచే

Back to Hebron Seeyonu Geethalu