CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 752

యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము

yesuni nindanu bharinchi aayana yoddaku velludamu

Hebrews 13:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసుని నిందను భరించి - ఆయన యొద్దకు వెళ్ళుదము (2)
1. సన్బల్లటు టోబీయా చేయు హేళనలు - వారలు పెట్టు శ్రమల భరించి (2) ఆయనతో సంతోషముగ భరించి (2) - బయలుదేరి వెళ్ళుదము1
2. స్తెఫను చావును మదిలో దలచి - పేతురు చెఱలో నుండుట దలచి మోసము లెన్నియో కల్గినగాని - బయలుదేరి వెళ్ళుదము
3. కపట సోదరుల వలన బాధలు - అపనిందలు మా కెన్నియున్న యేసు ప్రభువునే ద్వేషించినను - బయలుదేరి వెళ్ళుదము
4. కర్రలతోనే మము కొట్టినను కత్తులతో మము ఖండించినను ప్రజల వలన బహుగా నలిగినను - బయలు దేరి వెళ్ళుదము
5. ఉపవాసములతో యున్ననుగాని - జాగరణములతో యున్నను గాని దిగంబరత్వముతో మేమున్నన్ - బయలుదేరి వెళ్లుదము
6. అగ్నిలో నడువ వలసిన గాని - పలువిధ శ్రమలు మా పై బడినన్ చంపబడిన గొఱ్ఱెపిల్లను జూచి - బయలుదేరి వెళ్ళుదము
7. నిబ్బరముగ నిలుచుందుము మేము - యెహోవాయే మా పక్షము జేరి పోరాటములో జయము చేకూర్చున్ - హల్లెలూయ పాడుదము

Back to Hebron Seeyonu Geethalu