పల్లవి:యాజక ధర్మము నెరిగి - యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు (2)
1. ఆది ప్రధాన యాజకు డహరోను - ప్రభునికే ముంగురుతు (2) అతని కుమారులు విశ్వాసులకు (2) - ప్రాపుగ ముంగురుతు (1)
2. ప్రధాన యాజకుడు మనయేసే - యాజకులము మనమే పరమ పిలుపులో నిలిచినవారే - స్థిరముగ నుండెదరు
3. నాదాబు యనగా మనసున్నవాడని - అబీహువు నా తండ్రి ఎలియేజరనగ దేవుడు నా బలము -ఈతామారు ఖర్జూర భూమి
4. అహరోను ధరించిన వస్త్రములేడు - వాని యర్ధమేమి? ప్రభుయేసు వాని యందున్న - వాడు రక్షింపబడిన వారును
5. పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ - నిలువుటంగీ, పాగ మేలిమి బంగరు రేకు, విచిత్ర - మైన చొక్కా ఏడును
6. ఆయనతోడ వేయి వత్సరములు - ఆనందముతో నేలుచు యాజకులందరు భాగ్యశాలులై - హల్లెలూయ పాడెదరు