CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 750

ప్రియ యేసుని సైన్య వీరులము

priya yesuni sainya veerulamu

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రియ యేసుని సైన్య వీరులము - సైన్య వీరులము సైన్యవీరులము (1)శ్రేయంపు సిలువను మోసెదము - సైన్య వీరులము సైన్యవీరులము (1)
1. మన తండ్రి సమాధాన ప్రభువు - మన సర్వాయుధము మన నమ్రతయే (2) మన ఆత్మ సహాయకు డాయనే - సైన్య వీరులము సైన్యవీరులము (2)
2. ఎల్లప్పుడు యేసుని ధ్యానింతుము - ఎల్లరము జీవము నొసగెదము చల్లని యేసు ప్రేమకై సమర్పింతుము - సైన్య వీరులము సైన్య వీరులము
3. యేసు క్రీస్తుని ప్రేమకై చనిపోదుము - యేసుకై కాయ కసరులనైన తిందుము వేసినట్టి ముందంజను వెనుదీయము - సైన్యవీరులము సైన్యవీరులము
4. లోక స్నేహపు బంధముల్ త్రుంచితిమి - లోక మాయల నెల్లను విడిచితిమి వీకతో ప్రభుని కెదల నిచ్చితిమి - సైన్య వీరులము సైన్య వీరులము
5. రక్షణమార్గమిదేయని యెరిగితిమి - అక్షయంబుగ నాత్మలో నాటితిమి లక్ష్యబెట్టము చావు బ్రతుకులను - సైన్య వీరులము సైన్య వీరులము
6. వైరికోటల నాశంబు గావింతుము - కోరి శుభవేళ సత్యంబు చాటెదము చేరిసాక్ష్యము లీయను భయపడము - సైన్య వీరులము సైన్య వీరులము
7. హల్లెలూయా జయంబును తెలిపెదము - ఉల్లాసముతో ప్రభునిరాక చాటెదము ఎల్ల పాపాంధకారముల్ బాపెదము - సైన్య వీరులము సైన్య వీరులము

Back to Hebron Seeyonu Geethalu