పల్లవి:సిలువను వీడను - సిలువను వీడను (1)సిలువను వీడను - సిలువను వీడను - సిలువను వీడను (1)సిలువను సిలువను వీడను (1)
1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా? గొల్గొతాకొండ బాధలో - పాలు పొందెదవా? (2)
2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా? - మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా? || సిలువ ||
3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా? అవమానము వచ్చినన్ - సిల్వను మోతువా? || సిలువ ||
4. పాపాత్ములు గుణపడన్ - దత్తము చేతువా? - భయస్థులు ధైర్యపడన్ - యుద్ధము చేతువా? || సిలువ ||
5. లోకులు నాశమైరిగా - వీరులు లేకయే - విమోచకుడు సిల్వలో - వ్రేలాడి మృతి పొందెను || సిలువ ||
6. జీవాంతరము వరకు - నిల్చిపోరుసల్పి - దైవకృపచే గెల్చి నే - మోక్షము చేరుదున్ || సిలువ ||