CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 728

ప్రభురాజ్యం నిశ్చలమైనది

prabhuraajyam nishchalamainadi

Hebrews 12:28

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభురాజ్యం నిశ్చలమైనది - శుభప్రదంబు శాశ్వతమైనది (2)
1. పృథివినందు ఉన్న వన్నియు (2)- కదలి గతించి పోవుచున్నవి (2) గతించదు నీ వాక్యమెప్పుడు - ఖ్యాతిగాను నిలుచునెప్పుడు (2)
2. జనాంగములు కదలుచున్నవి - జగమందెల్లను శాంతియేలేదు ప్రభుని ప్రజలు స్థిరులై యుందురు - విభుని ప్రజలు నిత్యముండెదరు
3. భూమి ఆకాశముల్ కదలింపబడును - అంతరించి తరలిపోవున్ ప్రభుని గృహము కదలదెన్నడు - విభుని యిల్లు నిత్యమునిలుచున్
4. ఉదయించునుగ రాజ్య మొకటి - పొడిచేయునుగ అన్యరాజ్యములన్ ఆ రాజ్యం అంతరించదు - ఆ రాజ్యం నిత్యము నిలుచున్
5. తన ప్రజలకు రాజ్యము నొసగన్ - ఘనుడగు తండ్రి కోరిక యిదియే ప్రభు ప్రేమ చలించనేరదు - ప్రభు ప్రేమ నిలుచు నిరతం

Back to Hebron Seeyonu Geethalu