CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 727

ఎదురు చూచెదము దృఢపునాది

eduru choochedamu drudhapunaadi

Hebrews 11:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై -దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు - మన ముల్లసించెదము (2)
1. ఆ నగరములో ప్రభుమహానీయుడు - స్తుతులకు పాత్రుడుతానే (2) దేవుడా పట్టణమందున గలడు - కదలడు ఎన్నటికిన్ (2)
2. దృఢముగానున్న దేవుని నగరుకు - చుట్టు ప్రాకారము గలదు తన సింహాసనమందున గలడు - రాజాధి రాజాయనే
3. ప్రభు పట్టణమున నిత్యసంతోష - శాంతి విజయములు గలవు నీతిమంతులు సదాస్తుతులు పాడెదరు - ప్రభువారితోడ నుండ
4. జయవంతు లందరు ఆ నగరమున - నిత్యము నివసించెదరు భూమి పునాదులు వేయకమునుపే వారికై సిద్ధపరచెన్
5. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము"

Back to Hebron Seeyonu Geethalu