పల్లవి:నిశ్చలమైనది యేసు రాజ్యము (2)ప్రకాశించే రాజ్యము - యుగయుగములు నిలుచును2ప్రభుని రాజ్యము (1) - నిశ్చలమైనది యేసు రాజ్యము (2)
1. క్రీస్తు రాజ్య సింహాసనమెంతో గొప్పది - కనకంబున కన్న బహు ప్రకాశించును (2) దానిచుట్టు దేవుని మహిమ యుండును (2) దీక్షతోడ జయించెడువారే పొందెదరు (2)
2. నాశనము లేనిది యేసు రాజ్యము - నిత్యుడగు తండ్రి దాని స్థిరము జేసెను ప్రభుని రాజ్యము యెంతో అనంతమైనది పరిపాలించు తానే తరతరంబులు
3. తన రాజ్యమహిమకు మిమ్ము పిలిచెను - వినయముగా నీతి భక్తికలిగి నిలువుడి కడవరకు విశ్వాసము కలిగియుండిన క్రీస్తుయేసు మీకు నీతి మకుటమిచ్చును
4. యేసురక్తమందు యెవరు కడుగబడెదరో - వారే హృదయశుద్ధిని పొందెదరిలలో పరలోక రాజ్యములో ప్రవేశింతురు ప్రవిమలుని ముఖము జూచి సంతసింతురు
5. భూలోక రాజ్యములు అంతరించును - ప్రభుయేసు రాజ్యము నిలచు స్థిరముగా నీతి సమాధానములతో దేవుడేలును నేడే చేరవా నీవు ఆ రాజ్యములో?