CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 707

యేసే మనకిల స్వాస్థ్యము

yese manakila svaasthyamu

Ezekiel 44:28

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసే మనకిల స్వాస్థ్యము - వేరే స్వాస్థ్యము లేదికను (2)
1. అక్షయమును నిర్మలమైన - వడబారిన స్వాస్థ్యము మనకు (2) కరుణతో నోసగెను దేవుడు - హర్షముతో స్తుతియించెదము (2)
2. మనము క్రీస్తుని సంబంధులము - వాగ్దానంతో వారసులముగా చేయబడితిమి స్థిరముగా - చేతులెత్తి పూజించెదము
3. దేవుని సంకల్పమును బట్టి - మనలను ముందే నిర్ణయించి మనకొక స్వాస్థ్యము నేర్పరచెన్ - మనసారా మరి పాడెదము
4. పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను - పాలుపొందుటకు పాత్రుల జేసిన పరమ తండ్రికి స్తోత్రములు - నిరతంబును చెల్లించెదము
5. క్షేమమును మరి అభివృద్ధియును - కలుగ జేయుటకు శక్తిమంతుడు స్వాస్థ్యము నిచ్చిన దేవునికి హల్లెలూయా పాడెదము

Back to Hebron Seeyonu Geethalu